calender_icon.png 7 November, 2024 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో 'ఫ్రీడం పార్క్' ప్రారంభం..

07-11-2024 05:50:05 PM

కూకట్‌పల్లి (విజయక్రాంతి): పార్కులు పచ్చదనానికి ప్రతీకలుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెమిని ఎడిబుల్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి బాలాజీ నగర్ లో జిఈఎఫ్ ఇండియా కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఫ్రీడం పార్క్ ని 2.76 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలు వారాంతంలో కాకుండా ప్రతిరోజు ఆహ్లాదం కోసం పార్కులకు వచ్చేందుకు వారికి కావలసిన సదుపాయాలని కల్పించడం జరిగిందన్నారు.

చిన్నారుల కోసం ప్రత్యేకంగా రంగురంగుల స్వింగ్ లతో కూడిన ఆట పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పార్కులో గ్రీనరీతో పాటు ఆట పరికరాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించి పార్కులను సుందరీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కాంక్రీట్ జంగల్ గా మారిన నగరంలో కాస్తంత ఉపశమనం పొందేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిహెచ్ఎంసి భాగస్వామ్యంతో పార్కును మరింత సుందరీకరించి ఇక్కడి ప్రాంత ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.