ఇల్లెందు, నవంబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో బయోమైనింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ చేసి కాలుష్యాన్ని అరికట్టడమే బ యో మైనింగ్ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఇది జిల్లాలో తొలి బయోమైనింగ్ కావడం విశేషం.