calender_icon.png 29 December, 2024 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమయ్యక్ జాతర పోస్టర్ల ఆవిష్కరణ

28-12-2024 08:04:15 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): దంతనపల్లి శ్రీ భీమయ్యక్ జాతర పోస్టర్లను శనివారం ఎమ్మెల్యే కోవా లక్ష్మి తన నివాసంలో నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. తిర్యాని మండలం దంతనపల్లి గ్రామంలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం భీమయ్యక్ స్వామి జాతర ఉత్సవాలను 2025 జనవరి 9 నుండి 11 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అత్యధికంగా భక్తులు వచ్చి సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ గౌడ్ సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాయి సెంటర్ జిల్లా ఉప సర్మడి భీమ్రావు, మండల సర్మడి జ్ఞానేశ్వర్, ఉప సర్మడి గంగారం, ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, శేకురావు, నాయకులు చందన్ షా, భీమ్రావు, తిరుపతి, బీము తదితరులు పాల్గొన్నారు.