కూకట్ పల్లి (విజయక్రాంతి): సగర సంఘం సభ్యులు ఎల్లప్పుడు తనకు అండగా ఉన్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం బాలానగర్ లో సగర సంగం ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ ను ఆయన హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. సగరులకు ఎటువంటి ఆపద వచ్చిన తాను ముందు వరుసలో ఉంటానన్నారు. సగరులు ఐక్యతగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దిండు లోకేష్, జానకిరామ్, ఆవుల రవి, గిరి సాగర్, రాజు సాగర్, అర్జున్, నాగరాజు, సురేందర్ తదితరులు ఉన్నారు.