calender_icon.png 11 January, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌భవన్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-11-2024 12:04:01 AM

హాజరైన గవర్నర్, ఇతర అధికారులు 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఏక్ భారత్.. శ్రేష్ట భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో 8 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై ప్రసంగించారు.

నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు. చంఢీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి అవతరించాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్  శుభాకాంక్షలు తెలిపారు.

ఆయా రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలను గవర్నర్ కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం, విశ్రాంత ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్, టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సంయుక్త కార్యదర్శి జే భవానీశంకర్‌తో పాటు రాజ్‌భవన్‌లోని అధికారులు పాల్గొన్నారు.