calender_icon.png 7 February, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు

07-02-2025 04:53:52 PM

పూజా కార్యక్రమంలో పాల్గొన్నచెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి...

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణ స్వామి ఆలయంలో రమా సమేత సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయంలో నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలిసారి పూజా కార్యక్రమానికి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో  దేవస్థానం అర్చకులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.