calender_icon.png 12 April, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సీతారామ కళ్యాణ మండప ప్రారంభ వేడుకలు

04-04-2025 09:20:19 PM

నడిగూడెం: దాతల దాతృత్వంతో నడిగూడెంలో శ్రీ కోదండరామ స్వామి దేవస్థానానికి అనుబంధంగా నిర్మిస్తున్న సీతారామ కళ్యాణ మండపంలో శుక్రవారం  పుణ్యావాసనం, వాస్తు పూజ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మండప నిర్మాణం కోసం స్థలమిచ్చిన దాతలతోపాటు నిర్మాణ పనులకు దాతృత్వం చాటుకున్న దాతలతో కమిటీ సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయ పూజారి ఎస్బి వరదాచార్యులు మంత్రోచ్ఛారణలతో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు భవిరిశెట్టి వెంకటరత్నం, కె వి ఎస్ ఎన్ గుప్తా, వందనపు సూర్యప్రకాశరావు, మహేష్, కొండా దుర్గారావు, గజ్జి అప్పారావు, వందనపు మోహన్ రావు, దయాకర్ దివ్వెల శ్రీనివాసరావు చెల్లంచర్ల సత్యనారాయణ భువనగిరి ఉపేందర్, వందనపు కృష్ణమూర్తి కందిబండ అచ్చయ్య బెల్లంకొండ సత్యనారాయణ కాసాని వెంకన్న, గుండు శీను బాణాల నాగరాజు కాసాని శివ, రామ్ రెడ్డి, లింగరాజు గంగరాజు, మోహన్, నరసింహారావు, సత్యనారాయణ, రాము, మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.