20-02-2025 05:33:04 PM
సమన్వయంతో కలుపుకుపోయే మనస్తత్వం..
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి ఇకనైనా నీ బుద్ధి మార్చుకోవాలి..
కాంగ్రెస్ బీసీ నాయకులు స్ట్రాంగ్ వార్నింగ్..
కోదాడ (విజయక్రాంతి): కోదాడ బీసీ నాయకులను మోసం చేశారంటూ పొడుగు హుస్సేన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై కాంగ్రెస్ బీసీ నాయకులు అతనిపై ద్వజమెత్తారు. గురువారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కోదాడను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కోదాడను అగ్రగామిగా నిలుపుట కొరకు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అలాంటి వారిపై కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ, వారి మనోభావాలను దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులమే వారికి తగిన బుద్ధి చెబుదామని అన్నారు. ఉత్తమ్ దంపతులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సామాజిక కార్యకర్త పేరుతో జనాన్ని మోసం చేసేది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజవర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సమచిత స్థానం ఉందంటే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవ కాదా అని అన్నారు. అన్ని కులాలను మతాలను వర్గాలను కలుపుకుంటూ అభివృద్ధి ఆశయంతో నియోజవర్గంలో శాంతియుతంగా ప్రజలు జీవిస్తుంటే కులాల పేరుతో విమర్శలు చేస్తే జనమే సహించరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కందుల కోటేశ్వరావు, ఈదుల కృష్ణయ్య, ఒంటి పులి వెంకటేష్, పార సీతయ్య, సుందరి వెంకటేశ్వర్లు, కట్టెబోయిన శ్రీనివాస్ రావు, డేగ కొండయ్య, సైదిబాబు, పి వెంకటేశ్వర్లు, గుండెలు సూర్యనారాయణ, తిప్పిసేటి రాజు, డైరెక్టర్ సూర్యం, సత్యనారాయణ, షరీఫ్, నాగిరెడ్డి, కోటయ్య, ముత్తినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.