calender_icon.png 16 January, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

11-07-2024 01:45:24 AM

ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ప్రజాపాలన అందిస్తున్న సీ ఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు సుమన్, కిషోర్, బాలరాజులు చేస్తు న్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ రామచంద్రానాయక్ తెలిపారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో పేపర్లు లీకయి నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం సునీ ల్ నాయక్, ప్రవల్లిక చనిపోయినప్పుడు ఈ సన్నాసులు ఎటుపోయా రని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుదద్యోగులు, విద్యార్థులను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్‌ను ఎం దుకు నిలదీయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నే 28 వేల ఉద్యోగాలను ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని చెప్పారు.