calender_icon.png 10 January, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్​పై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు

18-09-2024 03:11:57 PM

జనగామ:  ఏఐసీసీ అగ్ర నేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీ బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తన్వీ దర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ స్పందించకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్​ నాయకులు అన్నారు. బయటకు వస్తే చంపేస్తామని, ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్​కు పడుతుందని బహిరంగంగా మాట్లాడినా బీజేపీ హైకమాండ్​ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం జనగామలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గనిపాక మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దూడల సిద్దయ్య గౌడ్ , నాయకులు సర్వల నరసింగ రావు, ఎర్రమల సుధాకర్, కంచ రాములు, చింతకింది మల్లేష్ నేత, చిర్ర సత్యనారాయణ రెడ్డి, కొన్నే మహేందర్ రెడ్డి, సుంకరి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ చందర్, జాయ మల్లేష్, శేఖర్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.