13-03-2025 02:02:24 AM
యూట్యూబ్ మహిళా జర్నలిస్టులు అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యూట్యూబ్ మహిళా జర్నలిస్టులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం నిప్పుకోడి అనే ‘ఎక్స్’ ఖాతాలోని ఒక వీడియోలో సీఎంకు వ్యతిరేకంగా ఓ రిపోర్టర్ తన ఇంటర్వ్యూలో ఓ గుర్తుతెలియని వ్యక్తిని రెచ్చగొడుతున్నట్టుగా ఉందని కాంగ్రెస్ సోషల్ మీడియా సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి పొగడదండ రేవతి, బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్‌మీడియా ట్రోలింగ్‌కు సంబంధించి వీరిద్దరిపై రెండు కేసులున్నట్టు తెలిపారు.