calender_icon.png 16 March, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికావు

16-03-2025 06:27:04 PM

టీపీసీసీ సభ్యుడు దబ్బేట రమేష్...

చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ టీపీసీసీ సభ్యుడు దబ్బేట రమేష్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చౌరస్తాలో టిఆర్ఎస్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం, అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు.

ఒక సభ్యుడు స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదనీ వ్యాఖ్యానించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, జగదీష్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధు వంశీకృష్ణ, చిలుకల రాయ కొమురు, అల్లకొండ కుమార్, గడ్డం కొమురయ్య, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కామిడీ రత్నాకర్ రెడ్డి, పింగిలి జ్యోతి, సీనియర్ నాయకుడు గంగాధరి రవీందర్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్ తదితరులు పాల్గొన్నారు.