* సోషల్ మీడియాలో డీఎస్పీ వీడియో హల్‌చల్
తూముకూరు, జనవరి 4: కేసు విషయమై ఠాణాకు వచ్చిన ఓ మహిళపై డీఎస్పీ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో డీఎ స్పీని సస్పెండ్ చేశారు. కర్ణాటక, తూముకూరు జిల్లాలోని మధుగిరిలో రామచంద్రప్ప డీఎస్పీగా పనిచేస్తున్నాడు. కేసు విషయమై గురువారం స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళతో అతడు అనుచితంగా ప్రవర్తించాడు.
ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు చిత్రీక రించి 35 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర సొంత ని యోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయంగా విమర్శ లు వచ్చాయి.
ఘటనపై దర్యాప్తు చేసిన తూముకూరు ఎస్పీ కేవీ అశోక్, డీజీ ఐజీపీ అలోక్‌మోహన్‌కు నివేదిక సమర్పించారు. ఉన్నతాధికారుల సూ చనల మేరకు డీఎస్పీ రామచంద్రప్ప ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఎస్పీ అశోక్ వెల్లడించారు. రామచంద్రప్ప పరారీలో ఉన్నాడు.