calender_icon.png 17 November, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

17-11-2024 12:00:00 AM

దిసనాయకే ప్రభంజనం

మార్క్సిస్టు నినాదంతో సంక్షోభంలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనురకుమార దిసనాయకే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన పార్టీని విజయ పథంలో నడిపారు. ఆయన నేతృత్వంలోని ఎన్‌పీపీ కూటమి 159 సీట్లు గెలుచుకుంది. ఇది పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ. శ్రీలంకలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు ఈ స్పష్టమైన మెజారిటీ దిసనాయకేకు అవసరం. కాగా, మార్క్సిస్టు భావాలు కలిగిన వ్యక్తి శ్రీలంక రాజకీయాలను శాసించడం ఇదే తొలిసారి. 

ప్రపంచంపై తులసి నిఘా

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ టీంలో హిందువైన తులసీ గబ్బార్డ్‌కు కీలక పదవి దక్కింది. జాతీయ నిఘా విభాగాధిపతిగా తులసిని ట్రంప్ ప్రకటించారు. దూకుడు వ్యక్తిత్వం కలిగి ఆమెను చూసి పాక్, ఇరాన్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఇప్పటికే భయపడుతున్నాయి. యుద్ధాలను ముక్కుసూటిగా ఖండించే తులసికి నిఘా బాధ్యతలు అప్పగించడం విశేషం.