తండ్రికి తగ్గ కొడుకు
ఆదివారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ శుక్రవారమే సుప్రీంకో ర్టులో చివరి వర్కింగ్ డే పూర్తి చేసుకున్నారు. తన రెండేళ్ల పదవీకాలంలో ఆర్టికల్ 370, ఎల క్టోరల్ బాండ్స్, నీట్ వివాదం, స్వలింగ వివాహాల వంటి కీలక కేసుల్లో తీర్పులిచ్చారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా పనిచేశారు. ఆయన తండ్రి ఇచ్చిన తీర్పులను సైతం చంద్రచూడ్ తిరగ రాయడం గమనార్హం.
దానశీలి శివ్‌నాడార్
భారత కుబేరుల్లో ఒకరైన హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్‌నాడార్ దాతృత్వంలో తనకెవరూ సాటిలేరని మరోసారి నిరూపించుకు న్నారు. రోజుకు రూ.5.9 కోట్ల చొప్పున గతేడాది రూ.2వేల కోట్లు విరాళాలుగా ఇచ్చినట్లు హురున్ ఇండియా వెల్లడించింది. దాతృత్వంలో మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. అత్యంత ధనవంతులైన అదానీ, అంబానీల కన్నా ఎంతో దూరంలో శివ్‌నాడార్ నిలిచారు.