calender_icon.png 27 October, 2024 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఈ వారం వార్తల్లో..

27-10-2024 12:00:00 AM

నానమ్మను గుర్తుకుతెచ్చేనా?

ప్రియాంకగాంధీ.. నానమ్మ ఇందిరాగాంధీ రూపం, ఆహార్యంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ తెచ్చిన నాయకురాలు. నాయనమ్మ పోలికలు ఉండటంతో ఉత్తర భారతదేశంలో ప్రియాంక ఓట్లను ఆకర్షిస్తారని ఎన్నికల్లో ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఉపయోగించింది. ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.

మొదటిసారిగా వయనాడ్ ఎంపీ ఉపఎన్నికల్లో ప్రియాంక బరిలోకి దిగుతున్నారు. రాహుల్‌గాంధీ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఈ సీటులో ప్రియాంక పోటీ చేస్తున్నారు. మంచి వాక్పటిమ ఉన్న ప్రియాంకకు పోటీగా బీజేపీ, సీపీఎం బలమైన అభ్యర్థులను నిలబెట్టారంటే ప్రియాంక చరిష్మా అర్థం చేసుకోవచ్చు.   

ట్రూడో మొండి వైఖరి

భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలనే చెప్పుకోవచ్చు. కెనడాలో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతోన్న ట్రూడో తనకు మద్దతిస్తున్న ఖలిస్థానీ సానుభూతి పార్టీల ఒత్తిడితో భారత్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ శక్తిగా ఎదుగుతోన్న భారత్‌కు వ్వతిరేకంగా పోతున్న ట్రూడోకు ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రాజీనామా చేయాలంటూ లిబరల్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తోన్న ట్రూడో తన వైఖరి మార్చుకోవడం లేదు. మరోవైపు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రూడో పార్టీకి ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.