calender_icon.png 16 March, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేవర్ బార్ దోపిడీ కేసులో..

17-12-2024 12:47:20 AM

* నిందితుడి అరెస్టు

శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీని బెదిరించి నగదు అపహరించిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్ అండ్ కిచెన్‌లో పనిచేస్తున్న బార్ సెక్యూరిటీ అజిత్‌సింగ్‌ను బొమ్మ తుపాకీతో  బెదిరించిన దుండగులు అతన్ని ఒక రూమ్‌లో బంధించి బార్ క్యాష్ కౌంటర్‌లోని రూ.4.50 లక్షల నగదుతో పాటు ఒక ల్యాప్‌టాప్, ఒక ఐప్యాడ్‌ను ఎత్తుకెళ్లారు. 

ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దోపిడీకి పాల్పడిన ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. అందు లో ఒకడైన శుభం కుమార్‌ను సోమవారం అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ. 1,50,000తో పాటు, ఐప్యాడ్, మాక్‌బుక్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెంది న వీరిద్దరు గతంలో అదే (తేవర్) బార్‌లో పనిచేశారు. పని సరిగా చేయడంలేదని ఉద్యోగంనుంచి బార్ యాజమాన్యం వారిని తొలగించిం ది. ఇది మనసులో పెట్టుకుని వారు ఈ దోపిడీకి పాల్పడ్డారని తెలిసింది.