calender_icon.png 15 January, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ పర్యటన నేపథ్యంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో తరలిన కాంగ్రెస్ శ్రేణులు

05-11-2024 06:21:03 PM

కాప్రా (విజయక్రాంతి): కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో చర్లపల్లి డివిజన్ నుంచి కార్పోరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగేళ్ల బాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రెడ్డి, ప్రభు గౌడ్లతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాల, యువజన విభాగం నాయకులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.