calender_icon.png 22 January, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంలో టెలికం సంస్థలకు చుక్కెదురు

20-09-2024 02:02:49 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఏజీఆర్‌ల బకాయిలను సవరించాలని టెలికం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీ ంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ప్రభుత్వానికి సుదీర్ఘకాలంగా చెల్లించాల్సిన బకాయిలను పునశ్చరణ చేయాలని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ 2019 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశా యి. 2019లో ప్రభుత్వానికి రూ.92 వేల కోట్లు 3 నెలల్లో చెల్లించాలని సుప్రీం తీర్పునిచ్చింది. టెలికం ఆపరేటర్లు దాఖలు చేసిన పిటిషన్‌లో డీవోటీ బకాయిలను లెక్కించడంలో తప్పులు దొర్లాయాయని, అందులో లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీలు కూడా కలిపి లెక్కించారని ఆరోపించారు. అంతేకాకుండా కొన్ని కంపెనీలపై ఏకపక్ష జరిమానాలు విధించాయని చెప్పారు. 

విరుద్ధ వాదనలు

సాధారణంగా లైసెన్సులు, స్పెక్ట్రమ్ వినియోగం ద్వారా డబ్బు సంపాదించే ప్రభు త్వంతో టెలికం సంస్థలు ఆదాయాన్ని ఎలా పంచుకుంటాయో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) శాతాన్ని బట్టి టెలికం శాఖ నిర్ణయిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగానికి 3 శాతం, లైసెన్స్‌కు 8 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఏజీఆర్ లెక్కలు 20 ఏళ్లుగా వివాదాస్పదంగానే ఉంది.