calender_icon.png 29 April, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తర తెలంగాణ కథలో..

29-04-2025 12:00:00 AM

విజనరీ డైరెక్టర్‌గా సినీప్రేక్షకుల మనసు గెలుచుకున్న సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘ఓదెల2’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా ఆయన మరో ప్రాజెక్టును త్వరలో పట్టాలెక్కించనున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘శర్వా38’గా ప్రచారంలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించనున్నారు.

1960లో ఉత్తర తెలంగాణ సరిహద్దులో సాగే కథతో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. తాజాగా మరో హీరోయిన్ ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు సోమవారం వెల్లడించారు. ఓ క్రూషియల్ క్యారెక్టర్ కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేసినట్టు తెలిపారు.

కథలో ఇంపాక్ట్ ఫుల్ క్రూషియల్‌ను డింపుల్ పోషించనుందని, ఈ పవర్‌ఫుల్ పాత్రకు ప్రాణం పోసేందుకు డింపుల్ పర్ఫెక్ట్ చాయిస్ అని టీమ్ పేర్కొంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో డింపుల్ ముఖం కనిపించకపోయినా ఆమె మెడ, ముక్కు, చెవులు, చేతులు, వేళ్లపై బంగారు ఆభరణాలతో ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. అనుపమ, డింపుల్ ఇద్దరూ కథలో ప్రభావంతమైన పాత్రలను పోషిస్తున్నారని తెలిపారు.

ఇక డింపుల్ హయాతి విషయానికొస్తే.. తెలుగులో గల్ఫ్ (2017) సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో ‘యురేకా’ సినిమాలో నటించింది. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో ‘జర్రజర్ర’ పాటలో నటించింది. 2022లో ‘ఖిలాడి’ సినిమాలో రవితేజతో జత కట్టింది.