calender_icon.png 29 September, 2024 | 2:56 AM

రాష్ట్రంలో కులాలవారీగా లెక్కపెడతలేరు

29-09-2024 12:57:16 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో కుక్కలనైనా లెక్కవెడుతు న్నరుగానీ కులాల వారీగా మనుషులను లె క్కపెట్టే ఆలోచన చేయడంలేదని ఎమ్మెల్సీ తీ న్మార్ మల్లన్న హాట్ కాంమెంట్స్ చేశారు. శ నివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన తెలంగాణ బీసీ మహాసభలో ఆయన ప్రసంగించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా తీరని అన్యా యం జరుగుతోందన్నారు.

తెలంగాణలో చిట్టచివరి రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మిగు లుతాడని, వచ్చే ప్రభుత్వంలో బీసీలే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. నూటికి 54 శా తం ఉన్న బీసీలకు 25శాతం మాత్రమే వా టా దక్కుతోందని, ఏడు శాతం ఉన్న రెడ్లు, వెలమలు ఎక్కువ శాతం లబ్దిపొందుతున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీసీ బిడ్డల ఫీజులతోనే విద్యా సంస్థల ద్వారా సంపాదించాడని అ న్నారు. రాహుల్‌గాంధీ కులగణకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఉప్పల వెంకటేష్, జేఏసీ నా యకులు సదానందంగౌడ్, కొమ్ము శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.