calender_icon.png 16 January, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షూటింగ్‌లో కొందరికి పూనకాలొచ్చాయ్

08-08-2024 02:25:01 AM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ మూవీ ఇదే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు యదు వంశీ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివీ.. “నేను ఓ ఇండీ ఫిల్మ్ తీశాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఇంతవరకు ఎవరి దగ్గరా పని చేయలేదు. సినిమాల అనుభవం లేదు. కథను రాసుకుని చాలా ప్రొడక్షన్ కంపెనీలు తిరిగాను. చివరకు నిహారిక గారు ఓకే చేశారు. మా ఊళ్లో జరిగే జాతరను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాను.

ప్రతి కుర్రాడి కథ ఇందులో కనిపిస్తుంది. నిహారిక గారు నాకు కావల్సినవన్నీ సమకూర్చుతూ, చెప్పింది చెప్పినట్టుగా తీసే స్వేచ్ఛనిచ్చారు. రెగ్యులర్ పంథాలో వెళ్లకూడదనే ఉద్దేశంలో ఇలాంటి కథను ఎంచుకున్నాను. 2019లో కొంత రీసెర్చ్ చేశాను. జయప్రకాశ్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటల స్ఫూర్తితోనే కొన్ని సీన్లను రాసుకున్నాను. ఫ్రెండ్ షిప్, పొలిటికల్ అంశాలను ఇందులో జొప్పించాను. సెట్‌లో అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని వర్క్‌షాప్స్ ఎక్కువగా చేశాను.

చిరంజీవి గారు సినిమా చూసి అందరూ అద్భుతంగా నటించారని చెప్పడం, వరుణ్ తేజ్ గారు చూసి 11 మందీ ఇరగ్గొట్టేశారని చెప్పడంతో చాలా ఆనందమేసింది. ఇందులో మదర్ సెంటిమెంట్ కన్నీళ్లు తెప్పిస్తుంది. మన ఊరు, మన కుర్రోళ్లు, మన ప్రేమ, మన భావోద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాం. షూటింగ్ టైమ్‌లో నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చా యి. థియేటర్‌లో కూర్చుంటే నిజం గా జాతరలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మూవీని థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. నెక్ట్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కథను రాసుకుంటున్నాను. అందరూ భయపడేలా ఈ కథ ఉంటుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్ అయితే, నేను అనుకున్న హీరోతోనే ఆ సినిమా చేస్తాను.