ఆస్తానా (కజకిస్థాన్): భారత బాక్సర్ గౌరవ్ చౌహాన్ ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో సెమీస్లో అడుగుపెట్టాడు. మంగళవారం పురుషుల 92 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గౌరవ్ 3 స్థానిక ఆటగాడు డేనియల్ సపర్బేను ఓడించి కనీసం కాంస్యం ఖరారు చేశాడు. ఆరుసార్లు ఆసియా చాంపియన్ శివ తపా మాత్రం తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు.