calender_icon.png 19 January, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రీతి పాత్రలో..

31-08-2024 01:02:39 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానున్నది. మూడు రోజులుగా వరుసగా సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తున్న చిత్రబృందం తాజాగా శుక్రవారం శ్రుతిహాసన్ లుక్‌పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రుతి ఈ సినిమాలో ప్రీతి పాత్రలో కనిపించనున్న విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇంకా ఇందులో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. నాగార్జున అక్కినేని ‘సైమన్’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.