calender_icon.png 26 December, 2024 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల అధికారి పాత్రలో

06-11-2024 12:00:00 AM

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అనిత సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఎన్నికల అధికారి పాత్రలో కనిపించనున్నారు.

అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్లను నిబద్ధతతో నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్‌గా అగుపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025, జనవరి 10న విడుదల కానుందీ సినిమా. అయితే, ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 9న హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో రిలీజ్ చేయనున్నారు.

ఈ సిటీలో పెద్ద ఎత్తున టీజర్ రిలీజ్ చేస్తున్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్‌చరణ్ కావటం విశేషం. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు చిత్ర కథానాయకానాయికలు రామ్‌చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్ సహా సినీ ప్రముఖులందరూ హాజరుకానున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా; పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్; సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు; ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల; యాక్షన్ కొరియోగ్రఫీ: అన్బరివు, నృత్య దర్శకత్వం: ప్రభుదేవా, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ.