calender_icon.png 26 November, 2024 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో 200 మంది బీఆర్ఎస్ లో చేరిక

06-11-2024 03:20:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రెండో వార్డుకు చెందిన 200 మంది కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన యువకులు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందించడంలో విఫలమైందన్నారు. యువతను, ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. ప్రభుత్వ పాలనపై రాష్ట్రంలోనే బెల్లంపల్లి పట్టణంలో మొదటిసారిగా తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఈ తిరుగుబాటుతో కాంగ్రెస్ పతనం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్వి నాయకులు బడికల శ్రావణ్, సబ్బని అరుణ్, గోపి లతో పాటు వార్డు ప్రజలు, మహిళలు,యువకులు పాల్గొన్నారు.