calender_icon.png 20 April, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవి సమ్మేళనంలో

17-03-2025 12:00:00 AM

ఒకవేపు..

“నమస్కారాలండీ కార్యదర్శి గారూ!”

“నమస్కారాలండీ, రండి, 

అలా వెళ్ళి కూచోండి.”

“మాట, ఒక్క నిమిషం ఇలా వస్తారూ?”

“శలవివ్వండి.”

“కవులంతా వచ్చినట్టేనా?”

“ఆ.. దాదాపు అంతా వచ్చారు.”

“మరి నాకేమన్నా ఛాన్సు...?”

“మేము ఆహ్వానించిన కవుల్లో మీ పేరు...”

“లేదనుకోండీ... అయినా ఏం?... మీరిప్పుడు ఆహ్వానించొచ్చుగా..”

“ఈసారికి క్షమించాలి. మళ్ళీ తడవకి చూసుకుందాం...”

“నేను దీనికని ప్రత్యేకంగా పద్యాలు రాసుకొచ్చాను.”

“అయినా క్షమించాలి...”

“అయిదు నిమిషాలకంటే పట్టదు”

“క్షమించాలి...”

“పోనీ, అందులో రెండు పద్యాలు మాత్రం చదువుతాను...”

“క్షమించాలి...”

“వీల్లేదంటారా?”

“బొత్తుగా..?”

మరో వేపు...

“ఏమండోయ్ కవిగారూ! లేచారే?”

“ఆలస్యమవుతోంది. వెడతాను...”

“అప్పుడే?”

“నిద్ర వస్తోంది..”

“కాని, ఇంకా మీ కావ్యగానం...”

“అఖ్ఖరలేదు లెండి.”

“అయ్యో! ప్రజలంతా మీ పేరు విని వస్తే...”

“నేనేం చెయ్యనూ? నాకు నిద్ర వస్తోంది.”

“పోనీ మీదే ముందు కానిస్తాం..”

“ఉహుఁ! ఇంక వుండను...”

“ఇంత దూరం వచ్చీ...”

“మీరు ఆహ్వానించారని వచ్చాను...”

“మరి.. కావ్యగానమో..?”

“నేనలా వాగ్దానం చెయ్యలేదే.”

“ఈ వాదనకేం కాని, దయచేసి ఒక్క అయిదు నిమిషాలు...”

“ఉహుఁ.”

“పోనీ, రెండే రెండు పద్యాలన్నా...”

“వీల్లేదంటారా?”

“బొత్తుగా..” 

ప్రచురణ కాలం: 1969

‘పసిడి బొమ్మ’ సంకలనం నుంచి.. ‘కథా నిలయం’ సౌజన్యంతో..