calender_icon.png 11 January, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునుగోడు సమగ్రాభివృద్ధే ధ్యేయం

07-08-2024 12:11:50 AM

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి 

నల్లగొండ, ఆగస్టు 6 (విజయక్రాంతి)/మునుగోడు: మునుగోడు సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. చండూరు మున్సిపా లిటీలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ను ప్రారంభించారు. చిట్టెంపాడు నుంచి తిరుమలగిరి వరకు బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గద్దర్ వర్ధంతి, ప్రొఫెసర్ జయశంజర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.