calender_icon.png 25 October, 2024 | 7:55 AM

పాటల పల్లకిలో పైలం పిలగా..

07-07-2024 12:05:00 AM

వ్యవసాయం చేస్తే కడుపు నిండుతుంది కానీ కోట్లు కూడబెట్టలేమని బలంగా నమ్మిన ఓ యువకుడికి అనుకోకుండా సొంతూళ్లోనే కోట్ల రూపాయల బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కానీ పద్మవ్యూహం లాంటి బ్యూరోక్రసీ వలలో చిక్కుకొని ఎలాంటి అవస్థలు పడ్డాడు? చివరకు ఏం చేసాడు? అనే కథాంశంతో తెలంగాణ నేపథ్యంలో సాగే హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా’. సాయితేజ కల్వకోట, పావని కరణం జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ గుర్రం దర్శకుడు.

విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి ‘సోడు సోడు నొక్కమే నీ సోకు’ అనే పాటను ఇటీవల దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. యశ్వంత్ నాగ్ స్వరపరిచిన ఈ పాటకి ఆనంద్ గుర్రం సాహిత్యమందించగా, రామ్ మిర్యాల ఆలపించారు. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణబొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.