calender_icon.png 30 April, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్.ఐ.టి నాగపూర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో

10-04-2025 01:55:06 AM

పారమిత విద్యార్థుల ప్రతిభ

కొత్తపల్లి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఎన్.ఐ.టి నాగపూర్  లో ఇటీవల నిర్వహించిన డెక్బర ఆక్సెస్’ 25 ఆప్టిట్యూడ్ టెస్ట్ లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు సారాసర్ఫరాజ్, లింగాల హర్షిత, కందుకూరి రిషితలు అత్యుత్తమ ప్రతిభ కనబరచి రెండవ రౌండ్ కి  అర్హత సాధించారు.

నాగపూర్ ఎన్.ఐ.టి మార్చి 22, 23 తేదీలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలలో పలు రాష్ట్రాల విద్యార్థులు నాలుగు విభాగాల క్రింద  పాల్గొనగా 2వ విభాగంలో 9వ తరగతి చదువుతున్న కందుకూరి రిషిత అద్భుత ప్రతిభ కనబరచి ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచి 8,000 రూపాయల నగదు పురస్కారం అందుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు బాలాజీ తెలిపారు.

ఈ సందర్భంగా విధ్యార్థులను పారమిత పాతశాలల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, హనుమంతరావు, టి. యస్వి. రమణ, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత ప్రసాద్, సమన్వయకర్తలు,ఉపాధ్యాయులు  అభినందించారు.