ఇంటినే మ్యూజియంగా మార్చారు..
జగదీశ్ మిట్టల్.. ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రాల్లో జీవ కళ ఉట్టిపడుతుంది. 1925లో జన్మించిన ఆయన చిత్రకళపై మక్కువతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేసిన శాంతినికేతన్ కళాభవన్‌లో 1945లో పీజీ చేశారు. కమల అనే చిత్ర కారిణిని ప్రేమ వివాహం చేసుకుని భార్యతో కలిసి 1976లో తాను నివసించే ఇంటిలోనే మ్యూజియం ఏర్పాటు చేశారు. చిత్రకళపై ఆయన చేసిన కృషిని గర్తించిన ప్రభుత్వం 1990లో పద్మశ్రీతో సత్కరించింది.
ఆ పేద పిల్లాడు.. నేడు ఇస్రో అధిపతి
వీ నారాయణన్.. తమిళనాడులోని మేలట్టువిళ్తె అనే మారమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య పైకప్పులేని బడిలో సా గింది. ౧౦పూర్తయ్యాక ఉద్యోగం తొందర గా వస్తుందని పాలిటెక్నిక్ కోర్సు చేసి 1984లో ఇస్రోలో ఉద్యోగం సంపాదిం చారు. తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్‌గా పదొన్నతిపొంది విశేష సేవలందించారు. తాజాగా ఇస్రో చైర్మన్‌గా నియామకం అయ్యారు.