calender_icon.png 10 January, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

05-01-2025 12:08:48 AM

బూమ్ బూమ్ బుమ్రా

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్ అందుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఇటీవలే విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించిన బుమ్రా రేటింగ్స్ పరంగానూ దుమ్మురేపాడు.  ఐసీసీ టెస్టు రేటింగ్స్‌లో (907 పాయింట్లు) సాధించి అత్యధిక రేటింగ్‌తో అశ్విన్ రికార్డు బద్దలు కొట్టాడు. గతేడాది 13 టెస్టుల్లోనే 71 వికెట్లు పడగొట్టిన బుమ్రా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దటీజ్ బుమ్రా.

భారత అణు విభాగంలో ఆయనో శిఖరం

డాక్టర్ రాజగోపాల చిదంబరం.. ప్రముఖ అణు శాస్త్రవేత్త. 1974లో జరిపిన పోఖ్రాన్-1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించి.. రెండు అణు పరీక్షల్లో పాల్గొన్న అణు శాస్త్రవేత్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. బార్క్ డైరెక్టర్, అణుశక్తి కమిషన్ చైర్మన్ హోదాల్లో పని చేశారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది.