calender_icon.png 18 January, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్క్ ఫ్రం హోమ్ పేరుతో..

03-09-2024 04:13:12 AM

  1. రూ. 2.71 లక్షలను కాజేసిన సైబర్ నేరగాళ్లు 
  2. సైబర్ క్రైంకి బాధితుడి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ పేరుతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. రూ. 2.71 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(40)కి ఇటీవల బిగ్‌ఫాక్స్ కంపెనీ హెచ్‌ఆర్ పేరుతో ఓ కాల్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం జాబ్‌లు కల్పిస్తామని, ఆసక్తి ఉంటే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వివరాలను పంపాలని సూచించారు. వారి సూచ న మేరకు బాధితుడు తన వివరాలను పంపాడు. అనంతరం బీటీసీ ట్రేడింగ్ లింక్‌లో కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయ ని బాధితుడిని నమ్మించారు.

ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు మొద ట్లో కొద్ది మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అర్జించాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా మొత్తం రూ.2.71 లక్షలను పెట్టుబడులు పెట్టాడు. అనంత రం స్కామర్ల నుంచి ఎలాంటి స్పంద న లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.