calender_icon.png 30 November, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎన్‌సీలో ఉద్యోగాల పేరుతో..

15-10-2024 02:28:06 AM

నిరుద్యోగులను మోసం చేస్తున్న కి‘లేడీ’ అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14(విజయక్రాంతి) : ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న రేష్మ అలియాస్ స్వప్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరానికి చెందిన రేష్మ అలియాస్ స్వప్న.. ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ముండుగా ప్రాసెసింగ్ ఫీజు పేరిట డబ్బులు వసూలు చేస్తోంది.

అనంతరం నిందితురాలు, ఆమె సహచరులు కలిసి.. ప్రాసెసింగ్ ఫీజు కట్టినవారికి  నకిలీ ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్లను పంపుతారు. తదనంతరం ఉద్యోగంలో చేరేముందు ఒప్పందం కుదుర్చుకున్న డబ్బులు ఆన్‌లైన్ ద్వారా వసూలు చేసి వారితో కాంటాక్ట్స్ కట్ చేస్తారు. ఇలా ఆమె చేతిలో బాధితులు దాదాపు రూ.58.75లక్షలు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.