calender_icon.png 26 October, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో..

18-09-2024 12:20:33 AM

వ్యాపారికి రూ.8.94 లక్షలకు టోకరా

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : షేర్ మా ర్కెట్‌లో పెట్టుబడుల పేరుతో నగరానికి చెందిన ఓ వ్యా పారిని బురి డీ కొట్టించి రూ.8.94 లక్షలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలు.. నగరానికి చెందిన ఓ వ్యాపారి(56)కి  +918019 6587 82 నం బర్ నుంచి వాట్సాప్ మేసే జ్ వచ్చింది. అందులో తాను ‘షేర్‌ఖాన్ సెక్యూరిటీస్’ చీఫ్ స్ట్రాటజీ అనలిస్ట్ అంటూ వివరాలు పంపించాడు. షేర్ మార్కెట్‌పై ఆసక్తి ఉంటే తాము మెలకువలు నేర్పిస్తామం టూ, ఏమైనా సందేహాలు ఉంటే 97526 98874 నంబర్‌లో సంప్రదించాలని సూ చించాడు.

బాధితు డు ఆసక్తి చూపడంతో అతడిని ‘బీ1 షేర్‌ఖాన్ క్యాపిటల్’ వాట్సప్ గ్రూప్‌లో జాయిన్ చేశారు. అనంతరం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘SHAREKIPO’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని స్కామర్లు సూచించారు. తదనంతరం వారి సూచన మేరకు బాధితుడు పలుదఫాలుగా రూ.8.94 లక్షలను చెల్లించి పలు షేర్లను కొనుగోలు చేశాడు. ఆ షేర్లను విక్రయించినప్పుడు బాధితుడి ఖాతా యాప్‌లోకి నగదు జ మ అయ్యింది. అనంతరం స్కామ ర్లు వచ్చిన రాబడులతో మరిన్ని షేర్లు కొనుగోలు చేసినట్లు చూపించారు. అనుమానం వచ్చిన బాధితు డు ఆర్టీఏ (రిజిస్టర్డ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్) వెబ్‌సైట్లలో తనిఖీ చేసినప్పుడు తనకు ఎలాంటి షేర్లు కేటా యించబడలేదని గుర్తించాడు. దీం తో మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.