calender_icon.png 29 December, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదయం కాంగ్రెస్‌లోకి.. సాయంత్రం సొంతగూటికి

15-07-2024 01:50:02 AM

  1. ఉద్రిక్తతకు దారితీసిన బీజేపీ కౌన్సిలర్ రాజేష్ పార్టీ మార్పు

హస్తం నేతలు బలవంతంగా చేర్పించుకున్నారంటూ బీజేపీ ఆందోళన

ఆదిలాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్‌ఓఓఓ బీజేపీ కౌన్సిలర్  కాంగ్రెస్‌లో చేరడం ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రం జానీ ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరగా.. అతడిని గద్దె దించేందుకు అవి శాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు.. జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవిశాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఈనెల 18వ తేదీని ఫిక్స్ చేశారు. దీంతో వైస్‌చైర్మన్ పదవి ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు.. ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లకు గాలం వేస్తున్నారు.

ఇప్పటికే 8 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా ఆదివారం 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్ రాజేష్ అలియాస్ దొడ్డన్న కాంగ్రెస్‌లో చేరిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, ఎమ్మెల్యే శంకర్ తన యుడు శరత్ నేతృతంలో బీజేపీ నాయకు లు కాంగ్రెస్‌నేత శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. తమ కౌన్సిలర్‌ను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ నేతలను నిలవరించేందు కు ప్రయత్నించగా ఇరువురి మధ్య తోపులా ట, వాగివాదం చోటుచేసుకొంది. ఈ ఘర్షణలో పోలీస్ వాహనం అద్దాలు ధంసం అవ్వగా పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలవురిని అరెస్టు చేశారు.

సాయంత్రానికి సొంతగూటికి..

అయితే ఆదివారం రాత్రి కౌన్సిలర్ రాజే ష్ తిరిగి సొంతగూటికి చేరారు. ఎమ్మెల్యే శంకర్ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ రాజేష్‌కు బీజేపీ నేతలు బీజేపీ కండువా కప్పారు. తమ పార్టీ కౌన్సిలర్లను పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అంశం రసవత్తరంగా మారింది.