నిందితుడికి ఐదేళ్ల జైలు
సంగారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): గంజాయి సాగుచేసిన కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల జరిమాన విధిస్తూ మొదటి అదనపు సంగారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి కె.జయంతి బుధవారం తీర్పు ఇచ్చారని ఎస్పీ చెన్నూర్ రూపేశ్ తెలిపారు. కంగ్టి పోలీసు స్టేషన్ పరిధిలోని సిద్దంగర్గ గ్రామం లో బసప్పు మైల్ముర్(45) అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తున్నారని కంగ్టి పీఎస్‌లో ఫిర్యాదు చేశారన్నారు.
సర్వే నంబర్ 74/ఈలో 1.12 గుంటల పత్తిలో అంతరు పంటగా గంజాయి సాగు చేశారని తెలిపారు. అప్పుటి కంగ్టి ఎస్సై జి.నరేష్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖాలు చేశారన్నారు. కేసు పూర్వపరాలు విన్న జడ్జి.. తాజగా తీర్పు వెలువరించారన్నారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్, అప్పటి ఎస్సై నరేష్, ప్రస్తుత ఎస్సై విజయ్‌కుమార్, కోర్ట్ డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, శంకర్, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణను ఎస్పీ అభినందించారు.