calender_icon.png 22 September, 2024 | 4:34 PM

రైతు బతుకులో ‘కష్టాల’ మేట

22-09-2024 02:32:07 AM

  1. పచ్చని పొలాల్లో ఇసుక మేట, వరద నిలిచి కుళ్లిన పైరు
  2. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామన్న సర్కార్
  3. పరిహారాన్ని రూ.25 వేలకు పెంచాలని రైతాంగం డిమాండ్

ఖమ్మం, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. మున్నేరు, ఆకేరు, వైరా నదులు పొంగి వేలాది ఎకరాల్లోకి వరద చేరింది. వరదల తర్వాత వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న పొలాల్లో ఇసుక మేట వేసింది. వానలు వెళ్లిపోయి 15 రోజులు దాటినా సమస్య అలాగే తిష్ట వేసింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అధిక వడ్డీలకు నగదు తెచ్చి, పంటకు పెట్టిన పెట్టుబడులు వృథా అయ్యాయని వాపోతున్నారు. వరద రాకముందు కళకళలాడిన పంట ఇప్పుడు ఇసుకతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఏ రైతును కదలించినా కన్నీటి పర్యమంతమవుతున్నాడు.

 పంట నష్టం ఇలా..

వరదల ధాటికి జిల్లాలో 16,727 మంది రైతులకు చెందిన 27,639 ఎకరాల్లోని పత్తి పంట దెబ్బతిన్నది. 47 ఎకరాల్లోని మొక్కజొన్న, 690 ఎకరాల్లోని పెసర, 35,590 ఎకరాల్లోని వరి పైరును వరద కబళించింది. ఇలా జిల్లావ్యాప్తంగా రూ.63,93,60,000 మేర నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. అలాగే జిల్లావా ్యప్తంగా 68,345 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇలా రూ.68,34,50,000 మేర నష్టం వాటిల్లింది. 

అన్నదాతల పరిస్థితి దయనీయం..

వరద బీభత్సానికి తిరుమలాయపా లెం, ఖమ్మం అర్బన్, నేలకొండపల్లి, చింతకాని, కూసుమంచి,ఖమ్మం రూరల్ తదితర మం డలాల్లో సాగు చేస్తున్న పొలాల్లో ఇసుక మే ట వేసింది. కొన్నిచోట్ల పంటంలోకి రాళ్లు,ర ప్పలు చేరాయి. మరికొన్నిచోట్ల మడులు కో తకు గురయ్యాయి. ఆకేరు పరీవాహకంలో నినానూతండా,  ఖమ్మం రూరల్, వాల్యాత ండా, పిట్టల వారిగూడెం, గుండాల తండా, కస్నాతండా, తనగంపాడు, గూడూరుపా డు, తీర్థాలలో సాగు చేస్తున్న పంటల్లోకి ఇసుక మే ట వేసింది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఇసుక మేటను తొలగిస్తే తప్ప.. అంత ఖర్చుపెట్టి రైతులు తొలగించలేని దుస్థితి. ఒక్క పాలేరు నియోకవర్గంలోనే సుమారు 10 వేల ఎకరాల్లో ఇసుక మేట వేసిన్నట్లు తెలుస్తోంది.

అలాగే రైతులు పొలాల్లో బిగించిన డ్రిప్ ఇరిగేషన్, విద్యుత్ మోటార్లు సైతం ఆ గమయ్యాయి. నష్టం ఇంతగా ఉంటే ప్రభు త్వం ఎకరానికి కేవలం రూ.10 వేల పరిహారం ప్రకటించడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. కనీసం ఆ ప్రకటించిన సొమ్మునా ఇ ప్పటివరకు తమ ఖాతాల్లో కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టి నష్టపోతే, కేవలం రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించి, పరిహారం పెంచాలని కోరుతున్నారు.

సర్కార్ పరిహారం పెంచాలి..

 భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించింది. కానీ, ఆ పరిహారం రైతులకు సరిపోదు. సర్కార్ పునరాలోచించి ఆహార పంటలు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు పరిహారం అందించాలి. సర్కార్ కౌలు రైతులను సైతం ఆదుకోవాలి.

 భూక్యా వీరభద్రం, 

రైతు సంఘం నేత, ఖమ్మం