calender_icon.png 23 December, 2024 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్త్ సిటీలో భూనిర్వాసితులకు పట్టాలు ఇస్తాం: KLR

23-12-2024 08:10:29 PM

గ్రీన్ పార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

తుక్కుగూడ కార్యాలయంలో మీర్ఖాన్ పేట రైతులతో కిచ్చెన్న భేటీ...

మహేశ్వరం (విజయక్రాంతి): ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం కుందుకూరు మండలం మీర్ఖాన్ పేట గ్రామానికి చెందిన దాదాపు 100 మంది రైతులు కిచ్చన్న గారి లక్మరెడ్డిని కలిశారు. 112 సర్వేనంబర్ లో 844 ఎకరాల భూమిని టిజిఐఐసి తీసుకుని 86 ఎకరాలకు ఇంకా పరిహారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు.

ఈ సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ.. అసైన్డ్ భూములు కోల్పోయిన బడుగు, బలహీన వర్గాలకు ప్లాట్ల సర్టిఫికేట్లు, నష్టపరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా కర్షకులందరికీ పరిహారం, ప్లాట్లు వీలైనంత త్వరగా ఇప్పిస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొక్క జంగారెడ్డి, కృష్ణానాయక్, ఏనుగు జంగారెడ్డి, అందుగుల సత్యనారాయణ, కంబాలపల్లి మథన్ పాల్ రెడ్డి పాల్గొన్నారు.