calender_icon.png 23 October, 2024 | 7:00 PM

సరితూగే సమరంలో..

21-07-2024 12:28:12 AM

కాలానుగుణంగా ప్రజలను పట్టిపీడించే రాక్షసుల రూపాలు, పేర్లు మారినా వారి ప్రవృత్తి మారదు. అలాంటి అసురుడొకడు మా కథలోనూ ఉన్నాడంటున్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. అతగాడి పని పట్టేందుకు సమర్థవంతమైన ఓ నాయకుడు సరితూగే సమరం జరిపారట. ఆ కథేమిటన్నది ఆగస్టు 29న తెలియనుంది. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో రూపొందుతున్న చిత్రం ’సరిపోదా శనివారం’. కాగా శనివారం (జూలై 20) సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన ఎస్జే సూర్య పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఎస్జే సూర్య క్రూరుడైన పోలీస్ అధికారిగా కనపడుతున్నారు. సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు నరకాసురుడి వధ జరిపినట్టే ’సరిపోదా..’ చిత్రంలో చారు (ప్రియాంక మోహన్)తో కలిసి ఈ అసురుడి అంతమొదించనున్నాడు సూర్య (నాని). వారంలో ఒక్క రోజు మాత్రమే వయోలెన్స్‌కి కేటాయించే సూర్య, ఇలాంటి రాక్షసుడితో  సమరం ఎలా సాగించాడన్నది ఆసక్తికరం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మున్ముందు మరిన్ని రానున్నాయంటున్నారు మేకర్స్.