calender_icon.png 24 February, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణనలో మున్నూరు కాపుకు తీరని అన్యాయం

24-02-2025 07:14:41 PM

ఎన్నికల కోడ్ ముగియగానే భారీ నిరసన కార్యక్రమం..

వనమా రాఘవేంద్రరావు, ఎడవెల్లి కృష్ణ, రంగా కిరణ్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని, జరిగిన అన్యాయంపై సమరభేరి మోగిస్తామంటూ వనమా రాఘవ, ఎడవల్లి కృష్ణ, రంగా కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెంలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలో మున్నూరు కాపు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాలనే సమావేశంలో తీర్మానించారు. అనంతరం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను కలిసి వినపత్రం అందజేశారు.