calender_icon.png 16 January, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసులో..

06-09-2024 12:00:00 AM

నిందితుడికి ఏడాదిన్నర జైలు

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 5: నిర్లక్ష్యం గా వాహనం నడిపి రోడ్డు దాటుతు న్న ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు ఎల్‌బీనగర్‌లోని ఐదవ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమా నా విధించింది. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు.. ఘట్‌కేస ర్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన రోడ్డు ప్రమాద ఘటన క్రైం నెం.189/ 2018 కేసులో జనగాం జిల్లా  లింగా ల ఘనపూర్‌కు చెందిన గుర్రం శ్రీనివాస్(29) వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్త్తిని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పట్లో శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచార ణ అనంతరం ఎల్‌బీనగర్‌లోని ఐదవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిందితుడికి   గురువారం శిక్ష ఖరారు చేశారు.