calender_icon.png 4 February, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ లో పేద మధ్యతరగతి రైతు సంక్షేమానికి పెద్దపీట..

04-02-2025 05:24:20 PM

బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు...

హుజురాబాద్ (విజయక్రాంతి): కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేద మధ్యతరగతి సంక్షేమానికి పెద్దపీట వేశారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం ప్రధాని మోడీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 12 లక్షల వరకు టాక్స్ మినహాయింపు కోట్లాది మందికి గొప్ప శుభవార్త అని అన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. 

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు. బడ్జెట్ల లో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేటాయింపులు జరిగాయన్నారు. ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు తగిన విధంగా బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించారన్నారు.