కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న భారీ పిరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ కథానాయికలుగా నటిస్తు న్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన ర్‌పై చింతా గోపాలకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శ కులు సుజీత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించారు.
తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళంలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 31న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ ప్రకటన ప్రెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “క’ సినిమాను కొత్త కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి థియేటర్లలోకి తీసుకొ స్తున్నాం. 70వ దశకం నేపథ్యంతో కథ సాగుతుంది” అని తెలిపారు.