హీరో శర్వానంద్ తన 38వ చిత్రాన్ని ప్రకటించారు. సంపత్ నంది దర్శక త్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధా మోహన్ నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించ నున్నారు. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ--మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా దీనిని తెరకెక్కించనున్నారు.
బుధవారం ‘శర్వా38’ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా ఓ సెట్‌ని హైదరా బాద్ సమీపంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ బడ్జెట్‌తో ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించారు. శర్వా మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించను న్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.