calender_icon.png 17 November, 2024 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరగిరి సంస్థానం నేపథ్యంలో..

16-11-2024 12:00:00 AM

1940ల్లో అమరగిరి ప్రాంతంలో ఓ ఘటన జరిగింది. 1970లో అది మళ్లీ పునరావృతమయ్యేలా ఉంటుంది. అలా జరగటాన్ని అక్కడి ప్రజలు అమ్మోరు శాపంగా భావిస్తుంటారు. నిజంగానే అది అమ్మోరు సమస్యా? అని హీరో అక్కడకు వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమస్యమేమిటో తెలుసుకోవాలంటే ‘వికటకవి’ చూడాల్సిందే అంటున్నారు  దర్శకుడు ప్రదీప్ మద్దాలి.

జీ5 మాధ్యమం వేదికగా నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు సిరీస్ గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు. “తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్‌సిరీస్ ‘వికటకవి’కి నేను దర్శకత్వం వహిస్తున్నా. నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సిరీస్‌ను రామ్ తాళ్లూరి నిర్మించారు.

రైటర్ తేజ దేశ్‌రాజ్ రాసుకున్న కథ ఇది. ఆయన అడిగితే నేను కథ విన్నా. ఈ పీరియాడిక్ సిరీస్ చేయటం నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. కథంతా 1940, 1970 కాలాల్లో జరుగుతుంది. స్వాతంత్య్రం రాక మునుపు మన దేశంలో చాలా సంస్థానాలుండేవి.

అలాంటి వాటిలో తెలంగాణకు చెందిన అమరగిరి ప్రాంతం ఒకటి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారు.. కొన్నాళ్లలో ఊరు మునిగిపోతుందనే బ్యాక్‌డ్రాప్ కథతో ఈ ‘వికటకవి’ ఫిక్షనల్ పాయింట్‌ను తీసుకున్నారు.  తెనాలి రామకృష్ణుడి పాత్రలోని చతురత మిస్ కాకుండా ఉండేలా నరేశ్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం” అని వివరించారు.