సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నాసా అప్‌డేట్
న్యూ ఢిల్లీ, ఆగస్టు 8: మూడోసారి అంతరిక్ష ప్రయాణానికి వెల్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ వ్యోమనౌకలో సాంకేతిక లోపాల కారణంగా రోజుల తరబడి అక్కడే చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిద్దరి తిరుగు ప్రయాణం ఇప్పటికే పలుసార్లు వాయిదాలు పడగా తాజాగా 2025 ఫిబ్రవరి వరకు వారు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుందని నాసా బుధవారం తాజా అప్‌డేట్ ఇచ్చింది. వాస్తవానికి 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వారిరువురు జూన్ 14న భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
ఆ సమస్యను ఇప్పటికీ పరిష్కరించకపోవడంతో వీరిద్దరూ ఇంకా ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అ క్రమంలో నాసా వారి రాకపై బుధవారం ఓ ప్రకటన చేసింది. బోయంగ్ స్టార్ లైనర్ తిరిగి భూమి మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే.. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు మరో ఆష్షన్ 2025 ఫిబ్రవరిలో ఉంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని భూమి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తాం అని తెలిపింది. అంటే దాదాపు మరో 8 నెలలపాటు సునీత అంతరిక్ష కేంద్రలోనే ఉండే అవకాశం ఉంది. వారిని తీసుకొచ్చేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాసా అధికారులు తెలిపారు. వారు పస్తుతం సురక్షితంగానే ఉన్నారని, వారికి కావాల్సిన సౌకర్యాలు ఐఎస్‌ఎస్‌లో ఉన్నాయని తెలపింది.