అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం ‘జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్)’. అల్లు లత సమర్పణలో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జీఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. పవన్ శంకర్, యాని, తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. సినిమా తొలి షెడ్యూల్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ జీఎం నాయుడు మాట్లాడుతూ.. “జి.పి.ఎల్’ టైటిల్ కథకు సరిగ్గా సరిపోతుంది.
మనం ఏం చేసినా భగవంతుడి ఆదేశాల మేరకు చేస్తామనేదే సినిమా కథాంశం” అని తెలిపారు. నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ.. “లవ్, సస్పెన్స్‌తో కూడిన సినిమా. సింగిల్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేస్తాం” అని తెలిపారు. ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించనున్నారు.