calender_icon.png 7 February, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ కులాల గొంతు కోశారు..

07-02-2025 07:48:37 PM

ఎంబీ ఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేశం..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణలో 57 ఎంబీ ఎస్సీ కులాల గొంతు కోశారని మాదిగలకు 11 శాతం రిజర్వేషన్స్ కావాలంటున్న మంద కృష్ణ మాదిగది అత్యాశ అని, ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేశం ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూనే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం తమ కులాలను ప్రభుత్వం 'ఏ' గ్రూప్లో కలవ కపోవడం మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 57 ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, 2 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు అంథోని వెంకన్న డెక్కలి, సుద్దాల కుమారస్వామి, కోటూరి శ్రీనివాస్, బత్తుల పాండు, నవీన్, మహేష్,రవి డక్కలి పాల్గొన్నారు.