calender_icon.png 5 April, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓదెల2లో నేను ఎక్కువగా జైలు ఎపిసోడ్స్‌లోనే కనిపిస్తా..

04-04-2025 12:00:00 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఓదెల2’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్‌తేజ దర్శకత్వంలో రూపొందుతోందీ సినిమా. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకంపై డీ మధు నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బాపటేల్ విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు. “-ఓదెల రైల్వేస్టేషన్’ లాక్‌డౌన్ టైమ్‌లో ఒక చిన్న ప్రయత్నంగా మొదలు పెట్టిన సినిమా. అది ఘన విజయాన్ని అందుకోవడం, మళ్లీ ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో సీక్వెల్‌ను తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.

‘-ఓదెల1’ అవుట్‌అండ్‌అవుట్ మర్డర్ మిస్టరీ. ‘ఓదెల2’ సూపర్ నేచురల్ థ్రిల్లర్. తమన్నాతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆమె నా సోదరి పాత్రలో కనిపిస్తారు. నేను ఎక్కువ శాతం జైలు ఎపిసోడ్స్‌లో కనిపిస్తా. మొదటి భాగంలోలాగే రెండో భాగంలోనూ నా పాత్ర ప్రభావవంతంగా ఉంటుంది. తమన్నా ప్రతి పాత్రనూ సీరియస్‌గా తీసుకుంటారు. నేను తమన్నాలా ప్రత్యేకంగా హోమ్‌వర్క్ చేయలేదు.

భవిష్యత్తులో అలా కష్టపడాలనే విషయాన్నైతే తెలుసుకున్నా. తొలి భాగంలో నా పాత్ర గురించి చెప్పినప్పుడు అంతటి పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. కానీ, ప్రయత్నించమం టూ సంపత్ నాపై ఉంచిన నమ్మకం మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

‘ఓదెల’  నేను అన్ని రకాల పాత్రలు చేయగలననే నమ్మ కాన్ని కల్పించింది. ఆధ్యాత్మికత, దైవభక్తితో ముడిపడి ఉన్న కథ ఇది. ఆ దైవశక్తే మాకు విజయాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నా. ఒక పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం -తెలుగులో రెండు సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. కన్నడలో ఓ చిత్రం వచ్చే నెల ప్రారంభిస్తాం” అని   చెప్పారు.